Home  »  TV News  »  రోజురోజుకి దగ్గరవుతున్న రిషి, వసుధార.. షాక్ లో దేవయాని!

Updated : Apr 16, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -738 లో.. ధరణి ఆపిల్ ముక్కలు తీసుకొని రిషి దగ్గరికి వస్తుంది. మళ్ళీ వసుధార కూడా ఏం తినలేదు కదా అని ఆలోచించిన రిషి.. ఆ అపిల్ ముక్కలని వసుధార దగ్గరికి తీసుకొని వస్తాడు. అప్పుడే వసుధారతో దేవయాని మాట్లాడుతుంది. ఏంటి మెడలో ఏం లేకుండా తిరుగుతున్నావ్.. ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తావ్ అని వసుధారని దేవయాని అడుగుతుంది. నేను సమాధానం చెప్తాను మేడమ్.. మీరు దాని గురించి ఏం దిగులు పడొద్దంటూ వసుధార సమాధానమిస్తుంది. ఆ తర్వాత వసుధారకి ప్రేమగా ఆపిల్ ముక్కలు తినిపిస్తాడు రిషి. ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటారు. అది చూసిన దేవయాని వీళ్లిద్దరిని ఎలాగైనా విడదీయాలని అనుకుంటుంది. కాసేపటికి సర్ నాకు నిద్ర రావడం లేదని వసుధార అంటుంది. మన ప్రేమని గుర్తు చేసుకుంటూ నిద్రపోమని, గుడ్ నైట్ చెపుతాడు రిషి. మనమిద్దరం పక్కపక్కనే ఉండి ఎప్పుడు గుడ్ నైట్ చెప్పుకుంటామో.. ఆరోజు త్వరగా రావాలని కోరుకుందామని రిషి అంటాడు. సరేనని వసుధార అంటుంది. 

మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. రిషి వచ్చి పెద్దమ్మ  పిలిచారట అని అడుగుతాడు. అవును రిషి నీతో మాట్లాడాలని దేవయాని అంటుంది. ఇంటి పెద్దగా బాధ్యత తెలిసిన దానిని కాబట్టి మీ పెళ్లి త్వరగా చేయాలని అనుకుంటున్నానని దేవయాని అంటుంది. జగతి, మహేంద్ర మీరిద్దరు కలిసి పిల్ల తల్లి తండ్రులను తీసుకొని వస్తే మాట్లాడుకొని పెళ్లి చేద్దామని దేవయాని అంటుంది. మా ఫ్యామిలీ అంటే వాళ్ళు ఇప్పుడు సమస్యల్లో ఉన్నారని జగతితో అంటుంది వసుధార. మీరు మీరు మాట్లాడుకోవడం కాదు మాకు చెప్పండని దేవయాని అనగానే.. వాళ్ళ వాళ్ళు సమస్యల్లో ఉన్నారట అని జగతి అనగానే పిలిపించండి సమస్యలు లేని వారు ఎవరుంటారని దేవయాని అంటుంది. ఎవరూ వారిని రమ్మని పిలవాల్సిన పని లేదు పెద్దమ్మ.. వసుధర నేను ఒకరికొకరం ఇష్టపడ్డాం.. పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. మధ్యలో చిన్న చిన్న అపార్థలు అంతే.‌. ఈ శూన్యమాసం అయిపోయాక మీరే మంచి రోజు ఫిక్స్ చెయ్యండంటూ రిషి చెప్పగానే.. వసుధార, జగతి, మహేంద్రలు హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవయాని మాత్రం బిత్తరపోయి చూస్తుంది.

రిషి అన్న మాటలకు వసుధార ఎమోషనల్ అవుతూ ధరణిని హత్తుకుని మిమ్మల్ని అక్క అని పిలవాలని ఉంది మేడం అని అంటుంది. పిలవమని ధరణి అంటుంది. పిలిచే హక్కు ఇంకా రాలేదని అంటుంది వసుధార. త్వరలోనే మీ పెళ్లి అయిపోతుంది మీరు హ్యాపీ‌.. మనందరం హ్యాపీ అని ధరణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.